ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP MLAపై ఏపీ మంత్రి అసభ్యకర కామెంట్స్‌.. స్పీకర్‌కు ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-09-15T17:54:41+05:30

మంత్రి మేరుగ నాగార్జునపై టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి మేరుగ నాగార్జున (Meruga nagarjuna)పై టీడీపీ ఎమ్మెల్యేలు (SPeaker) స్పీకర్‌ తమ్మినేని సీతారాం (Tammineni sitaram)కు ఫిర్యాదు చేశారు. గురువారం స్పీకర్ ఛాంబర్‌కు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు... డొలా బాల వీరాంజనేయ స్వామి (Dola Bala Veeranjaneya Swami0పై మంత్రి మేరుగ నాగార్జున (AP Minister) కామెంట్లపై ఫిర్యాదు చేశారు. దళితులకే పుట్టావా అంటూ మంత్రి మేరుగ నాగార్జున... వీరాంజనేయ స్వామి (TDP MLA)పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ్యుల పుట్టుక గురించి అధికార పార్టీ నేతలు పదే పదే ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ తరహా వ్యాఖ్యలను స్పీకరుగా ఉండి.. కంట్రోల్ చేయకుంటే ఎలా అంటూ విరుచుకుపడ్డారు.


అయితే... టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబరులో ఉండగానే గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gandikota srikanth reddy) లోపలకు వచ్చారు. మేరుగ నాగార్జున ఆ తరహా కామెంట్లు చేయలేదని శ్రీకాంత్ రెడ్డి సమర్థించారు. దీంతో శ్రీకాంత్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు పరిశీలించుకోవాలని పయ్యావుల కేశవ్(Payyavula kesav) స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Lokesh) గురించి ఇదే తరహాలో ప్రస్తావించి రికార్డుల్లేవన్నారని టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. మేరుగ క్షమాపణ చెప్పకుంటే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సభ తిరిగి ప్రారంభించగానే మేరుగ కామెంట్లపై టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ప్రస్తావించనున్నారు. 

Updated Date - 2022-09-15T17:54:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising