ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YCP పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం: Anagani

ABN, First Publish Date - 2022-06-21T16:04:37+05:30

వైసీపీ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అనగాని సత్యపసాద్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: వైసీపీ (YCP) పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యపసాద్ (Anagani Sathyaprasad) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ (TDP) హయాంలో మైనారిటీల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలు ఆపేయడం దారుణమన్నారు. నిలిపేసిన పథకాలను తక్షణమే పునరుద్ధరించి, మైనారిటీలను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ముస్లిం సోదరులకు సంక్షేమం అందించడంలో వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలతో మైనారిటీలు మరింత పేదరికంలోకి వెళ్లిపోయారన్నారు. వైసీపీ పాలనతో మైనారిటీలకు ఒరిగిందేమిటని నిలదీశారు. టీడీపీ హయాంలో ఇచ్చిన రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలకు మంగళం పాడారన్నారు. మూడేళ్లుగా యువతకు ఉపాధి కరువైందని, ఉన్నత విద్య, విదేశీ విద్య నిలిచిపోయిందని అనగాని సత్యపసాద్ ఆరోపించారు.

Updated Date - 2022-06-21T16:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising