ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yanamala ramakrishnudu: జగన్ నోట సోషలిజమా.. సిగ్గుసిగ్గు

ABN, First Publish Date - 2022-10-21T18:39:44+05:30

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS jagan mohan reddy)పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala ramakrishnudu) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్ నోట సోషలిజమా.. సిగ్గుసిగ్గు. జగన్ రెడ్డి ఫాక్షనిస్టు పాలెగాళ్ల పుస్తకం చరిత్రకు సజీవ సాక్ష్యం. మోసానికి నిలువుటద్దం లాంటి జగన్ రెడ్డి మోసం గురించి మాట్లాడటమా..?. వైసీపీ నేతల (YCP Leaders) బూతులు చెవులకింపా..?. వేరేవాళ్ల తిట్లకు సుద్దులు చెప్పడం హాస్యాస్పదం’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అవనిగడ్డలో సీఎం జగన్ రెడ్డి (AP CM) వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయని మండిపడ్డారు. ఇడుపులపాయలో వేల ఎకరాల అసైన్డ్ భూముల కబ్జా సోషలిజమా అని ప్రశ్నించారు. లేక బెంగళూరు ఎలహంక, హైదరాబాద్ లోటస్ పాండ్, పులివెందుల, తాడేపల్లి ప్యాలెస్‌లు సోషలిజమా?  అని నిలదీశారు. అంతరించిపోయిన ఫ్యాక్షనిజాన్ని  జగన్ రెడ్డి (YCP Chief) మళ్లీ రాష్ట్రంలో విస్తరింపజేస్తున్నారని ఆయన ఆరోపించారు.


ప్రజాస్వామ్యమనే మాట జగన్ రెడ్డి(Jagan reddy) నోట రావడమే అతిపెద్ద పరిహాసమన్నారు. జగన్ రెడ్డి (AP CM Jagan mohan reddy)లో మచ్చుకైనా ప్రజాస్వామ్య లక్షణాలున్నాయా అని అడిగారు. జగన్ రెడ్డి అజెండా మోసం, దగా, దౌర్జన్యాలు, హత్యలే అని అన్నారు. జగన్ రెడ్డి మోసానికి చెల్లెలు సునీతారెడ్డి (Sunita reddy) సీబీఐకిచ్చిన అఫిడవిట్టే సాక్ష్యమని... తెలంగాణలో రోడ్డున పడ్డ మరో చెల్లి రుజువు అని తెలిపారు. వైసీపీ నేతలు తిట్టే బూతులన్నీ జగన్ రెడ్డి ట్రైనింగే కాదా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు (Chandrababu)ను ఉరి తీయమని, కాల్చి చంపేయమన్నపుడు సుద్దులు ఏమయ్యాయని అడిగారు. ‘‘అసెంబ్లీ (Ap Assembly) సాక్షిగా నీవాళ్లు బూతులు తిడుతుంటే వికటాట్టహాసం చేసిందెవరు?’’ అని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల (AP Politics)ను బూతులమయం చేసిందే జగన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ (YCP) మట్టి కొట్టుకుపోక తప్పదని యనమల రామకృష్ణ (Former minister) శాపనార్ధాలు పెట్టారు. 

Updated Date - 2022-10-21T18:39:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising