ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని అంశం పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం: Yanamala

ABN, First Publish Date - 2022-03-03T16:59:35+05:30

రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ముందు నుంచి టీడీపీ మూడు రాజధానులు బిల్లు చెల్లదని చెబుతూనే ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకొని, మూడు రాజధానులపై ముందుకు వెళ్ళిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతో నైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన హితవుపలికారు. హైకోర్టు తీర్పును గౌరవించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని... మరో అప్పీల్‌కు వెళ్ళకూడదన్నారు. హైకోర్టు చెప్పిన విధంగా రాజధాని భూములు అభివృద్ధి చేసి ప్రభుత్వం రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి నాశనమైందని యనమల రామకృష్ణుడు అన్నారు. 


Updated Date - 2022-03-03T16:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising