ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sajjalaపై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-05-23T18:42:11+05:30

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala ramakrishna reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్‌ను హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్(Uday bhaskar).. సజ్జలను కలిశారన్నారు. డ్రైవర్‌ను చంపేసి వైసీపీ ఎమ్మెల్సీ పెళ్లిళ్లకు తిరుగుతున్నారని... కానీ పోలీసులు మాత్రం అరెస్ట్ చేయడం లేదని  మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఉదయ్‌ భాస్కర్‌ను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని... లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఇన్నాళ్లు ప్రజలను, టీడీపీ నేతలను వేధించిన జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలనూ వేధిస్తోందని ఆగ్రహించారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఉదయ్‌ భాస్కర్‌పై కేసు పెట్టడానికి తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. గంజాయి సరఫరాలో ఉదయ్‌భాస్కర్ ప్రధాన భూమిక పోషిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే సజ్జల ఏం చేస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు. 

Updated Date - 2022-05-23T18:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising