ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల్లయ్య కుటుంబసభ్యులను ఫోన్‌లో పరామర్శించిన Lokesh

ABN, First Publish Date - 2022-06-04T18:20:51+05:30

వైసీపీ మూక‌ల చేతిలో హత్యకు గురైన టీడీపీ బీసీ నాయకుడు జల్లయ్య‌ కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ మూక‌ల చేతిలో హత్యకు గురైన టీడీపీ బీసీ నాయకుడు జల్లయ్య‌ కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara lokesh) ఫోన్‌లో పరామర్శించారు. జల్లయ్య భార్య, తండ్రి, తల్లితో ఫోన్లో మాట్లాడిన లోకేష్... వారిని ఓదార్చారు. జగన్ రెడ్డి(Jagan reddy) చేస్తోంది సామాజిక అన్యాయమని మండిపడ్డారు. ఒకపక్క సామాజిక న్యాయ భేరి అంటూ బస్సు యాత్రలు చేస్తూ మరోపక్క బీసీ నాయకుల్ని పక్కా ప్రణాళికతో హత్యలు చేయిస్తున్నారని టీడీపీ నేత ఆరోపించారు. బీసీలు తనవైపు లేరనే కక్షతోనే తన సామాజిక వర్గం నేతల్ని బీసీ నాయకుల్ని మట్టుపెట్టాలని జగన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు. జ‌గ‌న్‌రెడ్డి బినామీ పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్యచేశారని తెలిపారు.


రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా బీసీ నేతల హత్యల వెనుక పెద్ద కుట్ర ఉందని మండిపడ్డారు. బీసీ నేత జల్లయ్య కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజారెడ్డి రాజ్యాంగంలో హత్యలు చేసి హ్యాపీగా తిరగొచ్చు అనే భావనలో ఉన్నారన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమని... ఖచ్చితంగా చేసిన ప్రతి నేరానికి వైసీపీ నాయకులు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు.  హత్య చేసిన వారిని పట్టుకోవడం చేతగాని పోలీసులు... బంధువులకు తెలియకుండా జల్లయ్య మృతదేహాన్ని తరలించారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు కనీసం నివాళులర్పించడానికి కూడా లేదని అరెస్టులు చేయడం రాష్ట్రంలో పోలీసు శాఖ దుస్థితిని తెలియజేస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు. 


జల్లయ్య కుటుంబసభ్యుల ఆవేదన...

మూడేళ్లు గ్రామంలో లేకపోయినా కక్షగట్టి వెంటాడి జల్లయ్యని అతి కిరాతకంగా చంపారని కుటుంబసభ్యులు వాపోయారు. తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మృతదేహాన్ని తరలించారన్నారు. జల్లయ్యని హత్య చేసిన వారికి శిక్ష పడే వరకు న్యాయ‌ప‌రంగా పోరాడతామని కుటుంబసభ్యులు తెలిపారు. 


Updated Date - 2022-06-04T18:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising