ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Devineni uma Arrest: విజయవాడలో దేవినేని ఉమా మెరుపు ధర్నా.. అరెస్ట్

ABN, First Publish Date - 2022-09-21T16:50:34+05:30

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మెరుపు ధర్నాకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం (NTR Health university) పేరు మార్పుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheshwar rao) మెరుపు ధర్నాకు దిగారు. బుధవారం గొల్లపూడి ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ (TDP) కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని విజయవాడకి తీసుకువచ్చింది ఎన్టీఆర్ (NTR) అని ఈ సందర్భంగా దేవినేని ఉమా (TDP Leader) అన్నారు. అసలు ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది ఎన్టీఆర్‌కే అని చెప్పారు. అటువంటి ఎన్టీఆర్ పేరు తొలగించటం దుర్మార్గమని మండిపడ్డారు. శాసన సభలో బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని దేవినేని హెచ్చరించారు. కాగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ధర్నా చేస్తున్న దేవినేని ఉమా, టీడీపీ నేతలను అరెస్టు చేశారు. వారిని బలవంతంగా ఇబ్రహీంపట్నం వైపుకు తరలించారు. 


Updated Date - 2022-09-21T16:50:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising