ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు చేసిన ఉద్యమం ఏపీ మరిచిపోదు: Devineni uma

ABN, First Publish Date - 2022-03-04T18:12:24+05:30

808 రోజులుగా రాజధాని రైతులు చేసిన ఉద్యమం రాష్ట్రం మరచిపోదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని అమరావతి కోసం 808 రోజులుగా రాజధాని రైతులు చేసిన ఉద్యమాన్ని రాష్ట్రం మరచిపోదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... స్వాతంత్ర్య ఉద్యమం తరవాత ఆ స్థాయిలో ఉద్యమం చేశారన్నారు. సీఆర్డీఏ చట్టం అమరావతి ప్రజా రాజధానిని కాపాడిందని అన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే వెంటనే స్పందించాలని... ఈ రాష్ట్రానికి ఫైనాన్స్ గుమస్తా సీఎం కాకూడదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే డెవలప్మెంట్ చేసి అప్పగించాలని డిమాండ్ చేశారు. పక్కరాష్ట్రం నుండి తెచ్చుకున్న లాలూచీ నిధులతో అమరావతిని చంపారని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేయడం చేతకాదు...అందుకే చతికిల పడ్డారన్నారు.  రైతు చట్టాలపై ప్రధాని దేశానికి క్షమాపణ చెప్పారని... ఈ సీఎం ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. లాఠీలతో కొట్టిన పోలీసులకు అన్నం పెట్టిన చేతులు రైతులవని... ఇక బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని రైతులు ముందుకు వెళ్ళాలని దేవినేని ఉమా అన్నారు. 

Updated Date - 2022-03-04T18:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising