ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్ వ్యాఖ్యలను ఏకీభవిస్తున్నాం: chinarajappa

ABN, First Publish Date - 2022-03-15T15:13:50+05:30

వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని...వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకమవ్వాలంటూ జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని...వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకమవ్వాలంటూ జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి పోకూడదనే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు.  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటే వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా రావని తెలిపారు. ఇప్పటికే వైసీపీ పార్టీ అప్పులోకి వెళ్ళిపోయిందని... సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేని స్థితిలో ఉందని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు భయపడి మంత్రులు వారి సంసారం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ వ్యతిరేక ఓటు... జగన్‌ను ఓడించేందుకే ప్రజలు కోరుకుంటున్నట్లు పవన్ చెప్పారన్నారు. ప్రజల్ని ఈ ప్రభుత్వం పెడుతున్న హింస నుంచి గట్టెక్కించాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. పొత్తులు విషయం పార్టీ అధిష్ఠానం చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాక్షస పాలన అంతమవ్వాలంటే అంతా కలసికట్టుగా పోరాడాలన్న పవన్ కళ్యాణ్ మాటలతో ఏకీభవిస్తున్నామని చినరాజప్ప తెలిపారు. 

Updated Date - 2022-03-15T15:13:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising