ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ డేరా బాబా కొడాలి నాని: budda venkanna

ABN, First Publish Date - 2022-04-22T17:45:32+05:30

వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ డేరా బాబా కొడాలి నాని అని వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ నేత కొడాలి నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ డేరా బాబా కొడాలి నాని అని వ్యాఖ్యానించారు. డేరా బాబాకు కొడాలి నానికి ఒకే పోలికలు ఉన్నాయని... డేరా బాబాపై ఎన్ని కేసులు ఉన్నాయో కొడాలి నానిపై అంత కన్నా ఎక్కువ కేసులు ఉన్నాయని తెలిపారు. కొడాలి నాని గుడివాడలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గుడివాడలో పోలీసులకు కొడాలి నాని నెల నెలా మామూళ్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ పాలనలో అధికారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మట్టి మాఫియా దగ్గర ఉన్న పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మట్టి మాఫియాలో నాని వందల కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ ఎందుకు నానిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. గుడివాడ అక్రమాల పై సీఎం జగన్ ఒక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. మట్టి మాఫియా కేసులో వెంటనే కొడాలి నానిని అరెస్ట్ చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-22T17:45:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising