ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు పెద్దాయన కాదా..? ఆయన వయసెంత?: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2022-03-07T19:34:07+05:30

వయసును కూడా గౌరవించకుండా రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను అవమానించారన్న సీఎం జగన్ మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వయసును కూడా గౌరవించకుండా రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను అవమానించారన్న సీఎం జగన్ మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు.  గవర్నర్ వయసుకైనా విలువ ఇవ్వొద్దా అని సీఎం అనడం సరికాదన్నారు. ‘‘మేం గవర్నర్‌ను కాదు.. ఆయన తప్పిదాలనే ఎండగట్టాం. టీడీపీ అధినేత చంద్రబాబు పెద్దాయన కాదా..? ఆయన వయసెంత..? చంద్రబాబును వైసీపీ సభలో అవమానించ లేదా..?’’ అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 


సీఎం జగన్ ఏమన్నారంటే....

ఈ ఉదయం జరిగిన బీఏసీ భేటీలో అచ్చెన్నపై  సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకోవడం సరికాదన్నారు. గవర్నర్ ఏ ఒక్క పార్టీకి చెందినవారు కాదని తెలిపారు. వయసును కూడా గౌరవించకుండా అవమానించారన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని సీఎం జగన్ అన్నారు. 

Updated Date - 2022-03-07T19:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising