ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ఉద్యోగుల GPF ఖాతా నుంచి డబ్బు మాయంపై TDP ఆగ్రహం

ABN, First Publish Date - 2022-06-29T18:35:28+05:30

ఉద్యోగుల జీపీఎఫ్ నిధుల మాయంపై తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90వేల మంది ఉద్యోగులు... వారికి చెందిన రూ.800 కోట్ల జీపీఎఫ్‌ (GPF) నిధులు మాయమైపోయాయి! ఉద్యోగులకు తెలియకుండా, వారి సమ్మతి లేకుండానే ప్రభుత్వం ఆ సొమ్మును లాగేసుకుంది. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం జీపీఎఫ్‌ నుంచి అడ్వాన్సు ఇప్పించాలని ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండగా.... ఇప్పుడు వారి ఖాతాలను ఖాళీ చేయడం కలకలం సృష్టిస్తోంది. దీనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ (Jagan) ప్రభుత్వం పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తోందని విమర్శించారు.


ఉద్యోగులు దాచుకున్న సొమ్మును కూడా దోచుకుంటున్నారని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొమ్ము దోచుకున్నా.. ఉద్యోగులు మాట్లాడకపోవడం సరికాదన్నారు. ఇష్టారీతిన ప్రభుత్వం అప్పులు తీసుకువస్తోందని, రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు అందాల్సిన వసతుల్లోనూ ప్రభుత్వం కోతలు వేస్తోందని, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను మోసం చేస్తోందన్నారు. కారుణ్య నియామకాల్లోనూ ప్రభుత్వం మాటతప్పిందని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థకు కేటాయిస్తున్న నిధులతో..ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చు కదా?..నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు కదా? అని టీడీపీ నేతలు అన్నారు.

Updated Date - 2022-06-29T18:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising