ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: కడపలో చంద్రబాబు స్పీచ్.. ‘సీఎం.. సీఎం’ అని నినాదాలు.. బాబు రియాక్షన్ ఇది..

ABN, First Publish Date - 2022-05-18T21:53:53+05:30

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ సొంత జిల్లా అయిన కడపలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ సొంత జిల్లా అయిన కడపలో చంద్రబాబు ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. ర్యాలీ అనంతరం.. కడపలో చంద్రబాబు మాట్లాడుతుండగా.. తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్‌లో ‘సీఎం.. సీఎం’ అని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్న తమ ఆకాంక్షను నినాదాల రూపంలో వెలిబుచ్చారు. ఆ నినాదాలపై చంద్రబాబు స్పందిస్తూ.. ‘తమ్ముళ్లూ.. వినండి.. సీఎం పదవి నాకు కొత్త కాదు.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను.. పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను’ అని చెప్పారు.



రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు తెలిపారు. తప్పులు ఎత్తిచూపితే ఎల్లో మీడియా అని ముద్ర వేస్తున్నారని చంద్రబాబు జగన్ సర్కార్ తీరును ఎండగట్టారు. ఏపీలో సమర్థులు, మంచివారు లేనట్లు కొందరికి రాజ్యసభ సీట్లు ఇచ్చారని తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డికి వైసీపీ రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నందునే అప్పులు పుట్టలేదని, సొంత నియోజకవర్గానికి తాగునీరు ఇవ్వలేని సీఎం రాష్ట్రాభివృద్ధి చేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

Updated Date - 2022-05-18T21:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising