ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu Strategie: వైఎస్ అవినాశ్ రెడ్డి సీటుపై ఫోకస్.. రంగంలోకి రాజకీయ కుబేరుడు?

ABN, First Publish Date - 2022-08-31T02:22:37+05:30

సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్‌ పెట్టారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థిని ప్రకటించారు. ఎలక్షన్లకు ఇంకా చాలా సమయమే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: సీఎం జగన్ మోహన్ రెడ్డి (Cm Jagan Mohan Reddy) సొంత ఇలాకా కడప జిల్లాపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఫోకస్‌ పెట్టారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే అభ్యర్థిని ప్రకటించారు. ఎలక్షన్లకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ అభ్యర్థిని ఎంపిక చేయడం ద్వారా వ్యూహాలను పకడ్బంధీగా అమలు చేయవచ్చని చంద్రబాబు తలిచినట్టున్నారు. దివంగత మాజీ మంత్రి రాజగోపాల్‌ రెడ్డి కుమారుడు.. ప్రముఖ పారిశ్రామిక వేత్త.. ప్రస్తుతం టీడీపీ (Tdp) పొలిట్‌ బ్యూరోగా ఉన్న ఆర్‌.శ్రీనివాసుల రెడ్డి (R Srinivasula Reddy) అలియాస్‌ వాసును ఇటీవలే కడప ఎంపీ (Kadapa Mp) అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. శ్రీనివాసుల రెడ్డి గతంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది... పార్టీ నేతలు, ప్రజల మన్ననలు మెండాగా ఉన్న వ్యక్తి.  రాజకీయంగా కడప జిల్లా టీడీపీలో చురుగ్గా ఉన్న శ్రీనివాసులరెడ్డే అన్ని విధాలా సరైన క్యాండిడేట్‌ అని గుర్తించే ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది.


కడప జిల్లాలో రాజకీయంగా వైఎస్‌ కుటుంబాన్ని (Ys Family) కట్టడి చేయాలంటే అన్ని విధాలుగా ఆర్థిక బలం.. అంగబలం ఉన్న సమర్థుడు శ్రీనివాసుల రెడ్డి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ కుటుంబంపై డైరెక్టుగా కడప ఎంపీ అభ్యర్థిగా వాసును రంగంలోకి దింపారు. అయితే శ్రీనివాసుల రెడ్డిపై వైఎస్‌ అవినాష్‌ రెడ్డి గెలుపొందాడు. అయితే జగన్‌ పరిపాలనపై సొంత జిల్లా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అంతే కాదు కడప ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాసుల రెడ్డిని ప్రకటించి సరైన నిర్ణయం తీసుకున్నారన్న చర్చా నడుస్తోంది... 


కడప పార్లమెంట్‌ పరిధిలోని పులివెందులతోపాటు అన్ని నియోజకవర్గాల్లో శ్రీనివాసుల రెడ్డికి బంధువర్గాలతోపాటు జనంలో మంచి ఆదరణ ఉంది. ఈ సారి ఆయన గెలుపు ఖాయమని భావిస్తున్నారు. వాసన్నకు కడప పార్లమెంట్ ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమంటున్నారు. పాజిటివ్‌ టాక్‌ ఇప్పుడు వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిట్టింగ్‌ ఎంపీ అవినాష్‌ రెడ్డినే మరోమారు అభ్యర్థిగా ప్రకటించాలా వద్దా అన్న సందిగ్ధంలో జగన్‌ అండ్ కో ఉన్నట్టు సమాచారం.  ప్రస్తుతానికి చంద్రబాబు శ్రీనివాసుల రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన తన గెలుపుకు కావాల్సిన వ్యూహాలను రచిస్తుండటంలో బిజీగా ఉన్నారు.


Updated Date - 2022-08-31T02:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising