ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులా?: అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2022-01-20T21:32:25+05:30

తమ హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రభుత్వాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తమ హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులు చేస్తారా అని ప్రభుత్వాన్ని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గత టీడీపీ  ప్రభుత్వం 43 శాతం పీఆర్సీ ఇస్తే నాడు జగన్‌రెడ్డి తప్పుబట్టారన్నారు. నేడు అసలు వేతనాలకు జగన్‌ ఎసరు పెట్టాడని ఆయన ఆరోపించారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని కాగ్ నివేదికలు చెబుతున్నా ఆదాయం లేదంటూ ఉద్యోగుల పొట్ట కోట్టటం దుర్మార్గమన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన  హమీల్లో  రెండున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉద్యోగులకు మొండిచేయి చూపారన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీ కరణ చేస్తానని చెప్పి వారి ఆశలకు జగన్ సమాధి కట్టారని ఆయన ఆరోపించారు. ఉద్యోగుల న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. హక్కులు సాధించుకునే వరకు ఉద్యోగులకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-01-20T21:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising