ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తానా అంతర్జాతీయ కార్టూన్ల పోటీ

ABN, First Publish Date - 2022-12-07T02:36:45+05:30

అంతర్జాతీయ కార్టూన్ల (వ్యంగ్య చిత్ర) పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పూర్వ అధ్యక్షులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ నెల 26వ తేదీ వరకు అవకాశం

విజయవాడ కల్చరల్‌, డిసెంబరు 6 : అంతర్జాతీయ కార్టూన్ల (వ్యంగ్య చిత్ర) పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పూర్వ అధ్యక్షులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర తెలియజేశారు. మంగళవారం విజయవాడ సర్వోత్తమ గ్రంథాలయం ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తానా తొలిసారి తెలుగు కార్టున్‌ పోటీలు-2023 అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పోటీలో ప్రపంచంలో ఎక్కడ, ఏ దేశంలో ఉన్నా తెలుగు కార్టూనిస్టులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వ్యక్తులను, రాజకీయ పార్టీలను, మతాలను కించపరిచేలా కార్టూన్లు కాకుండా, వ్యవస్థలోని లోపాలను తెలియజేస్తూ తెలుగు భాష, సంస్కృతుల గొప్పతనాన్ని సమాజానికి తెలియపరిచే విధంగా కార్టూన్లు పంపాలన్నారు. కార్టూన్‌ పోటీ కార్యనిర్వాహక సభ్యులు కళాసాగర్‌ మాట్లాడుతూ రూ.లక్ష నగదు బహుమతులతో కార్టూన్‌ పోటీ నిర్వహించడం ఇదే తొలిసారని, కార్టూనిస్టులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పోటీకి వచ్చిన కార్టూన్లలో బాగున్న వాటితో ఒక ఈ-బుక్‌ తెస్తున్నామన్నారు. పోటీకి వచ్చిన కార్టూన్ల నుంచి 12 అత్యుత్తమ కార్టూన్లను ఎంపిక చేసి, ఒక్కొక్క కార్టూనుకు రూ.5 వేలు, మరో 13 ఉత్తమ కార్టూన్లకు ఒక్కొక్క దానికి రూ.3 వేలు చొప్పున మొత్తం 25 మందికి నగదు బహుమతులు అందచేస్తామన్నారు. ‘తానా కార్టూన్‌ కాంటెస్ట్‌ 23 ఎట్‌ ది రైట్‌ జీమెయిల్‌.కామ్‌’కు ఈ నెల 26వ తేదీలోగా పంపాలన్నారు. ఫలితాలను 2023 జనవరి 15వ తేదీ సంక్రాంతి రోజున ప్రకటిస్తామన్నారు. ఈ పోటీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం 98852 89995, 9154555675 నంబర్లలో సంప్రదించవచ్చని కళాసాగర్‌ తెలిపారు.

Updated Date - 2022-12-07T02:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising