ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టాల్లో టమాటా సాగు.. రైతు కల చెదిరింది..!

ABN, First Publish Date - 2022-04-10T11:56:32+05:30

టమాటా రైతు కల చెదిరింది. అధిక లాభాలు తెచ్చిపెడుతుందని టమాటా సాగు చేపడితే తీరా పంట చేతికి వచ్చే సమయంలో మార్కెట్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: టమాటా రైతు కల చెదిరింది. అధిక లాభాలు తెచ్చిపెడుతుందని టమాటా సాగు చేపడితే తీరా పంట చేతికి వచ్చే సమయంలో మార్కెట్‌కు తరలించేందుకు రవాణా ఖర్చులు కూడా రాక చేతికి వచ్చిన పంట పొలాల్లో వదిలేసే పరిస్థితి వచ్చిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకనొక సమయంలో టమాటా ధర కిలో రూ.100 కూడా పలికిందని, దీంతో సగం ధర అయినా లేకపోతుందా అని అధికసంఖ్యలో సాగు చేపడితే ప్రస్తుతం కిలో రూ.4 కూడా పలకడం లేదని, కూలీలు ఖర్చులు మినహాయించి రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


పంటకు రూ.70వేల వరకు పెట్టుబడి పెట్టామని, చేతికి రూపాయి ఆదాయం వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. రెండేళ్లుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నామని వారు చెబుతున్నారు. టమాట కిలో రూ.15 పలికితే కోత కూలీలు, రవాణా చార్జీలు పోగా రైతుకు రూ.6 మిగులుతుందని ఇప్పుడు కిలో రూ.4 పలకడంతో చేతి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకే చేతికి వచ్చిన పంటను పొలాల్లో వదిలేసి దిగాలుగా చూస్తున్నామని రైతులు అంటున్నారు. పెట్టిన పెట్టుబడి రాక అప్పుల్లోకి కూరుకుపోయామని వారు ఆందోళన చెందుతున్నారు. ఒకానొక సమయంలో అధిక ధరలు పలకడం వల్లే ఈసారి సాగు ఎక్కువ చేపట్టామని తీరా పంట చేతికి వచ్చే సమయంలో ధర పాతాళానికి పడిపోయి రైతులు నష్టాల్లో మిగిలిపోయారన్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

Updated Date - 2022-04-10T11:56:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising