ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారంలో ఉండి రాజ్యాంగాన్ని గౌరవించడం తెలియదు: సుంకర పద్మ

ABN, First Publish Date - 2022-03-07T16:05:56+05:30

విజయవాడ: జగన్ ప్రభుత్వంపై కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: జగన్ ప్రభుత్వంపై కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మ విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని వైసీపీ ప్రజా ప్రతినిధులు గౌరవించడం లేదని మండిపడ్డారు. కోర్టులు చివాట్లు పెట్టినా.. ప్రభుత్వంలో చలనం లేదన్నారు. అడ్డగోలుగా మాట్లాడడం సరైన విధానం కాదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో తీసుకున్న ప్రతి ఒక్కటి తప్పుడు నిర్ణయాలేనని అన్నారు.


జగన్ పాదయాత్ర చేసినప్పుడు అమరావతి రాజధానిగా ఉంటుందని హామీ ఇచ్చి.. ఎన్నికల మానిఫెస్టోలో కూడా పెట్టలేదని సుంకర పద్మ ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాంతాలు, కుల మతాల మధ్య చిచ్చు పెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి.. మూడుముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి హైకోర్టు చీవాట్లుపెట్టి, మొట్టికాయలు వేసిందన్నారు. అయినా సర్కార్ వైఖరిలో మార్పు రాలేదని పద్మ దుయ్యబట్టారు.

Updated Date - 2022-03-07T16:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising