ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీడని వర్షాలు.. నీట మునిగిన పైర్లు

ABN, First Publish Date - 2022-10-17T10:22:06+05:30

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కూడా వర్షాలు వీడలేదు. ఉమ్మడి గుంటూరుజిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలదిగ్బంధంలో పలు కాలనీలు

కొండవీడులో విరిగిపడిన కొండచరియలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికం 


గుంటూరు, ఏలూరు సిటీ, అక్టోబరు 16: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కూడా వర్షాలు వీడలేదు. ఉమ్మడి గుంటూరుజిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వేలాది ఎకరాల్లో పత్తి, మిరప పైర్లు నీటమునిగాయి. పలు పట్టణాల్లోని శివారు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీనికి తోడు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావడంతో కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. డెల్టా ప్రాంతంలోని పలు లంక గ్రామాల్లో కూరగాయల తోటలు, వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి అరవింద వారధి ఎగువన గండిపడి ఇటుక కల్లాలు, బట్టీలను ముంచెత్తుతూ కొల్లూరు కరకట్టను తాకింది.  శనివారం చారిత్రక కొండవీడుకోట ఘాట్‌రోడ్డు 3, 6, 10వ మలుపుల వద్ద కొండచరియల అంచుల నుంచి భారీగా రాళ్లు, మట్టి, చెట్లు జారి రోడ్డుపై పడ్డాయి. గురజాల మండలం పల్లెగుంత సమీపంలో ఉన్న రైల్వే ఆర్వోబీలో భారీగా వర్షపు నీరు చేరి అదే గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాక్టర్‌ పూర్తిగా మునిగిపోయింది. ట్రాక్టర్‌లోని రైతు, మరికొందరు అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డారు. ఏలూరు జిల్లాలో ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఎగువన భారీ వర్షాల కారణంగా ఎర్రకాలువకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో కొంగువారిగూడెం ఎర్రకాలువ ప్రాజెక్టు నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 2,633 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 

Updated Date - 2022-10-17T10:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising