ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారు: భరత్‌

ABN, First Publish Date - 2022-12-07T02:57:42+05:30

సమైక్య రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించిందని వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఒక ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టబోతున్నట్లు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : సమైక్య రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించిందని వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో ఒక ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెట్టబోతున్నట్లు తెలిపారు. అయితే.. కేంద్ర ప్రభుత్వమే విభజన చట్టంలో సవరణ తీసుకొచ్చి, ప్రత్యేక హోదాను అందులో పొందుపరిస్తే బాగుంటుందన్నారు. మంగళవారం జరిగిన పార్లమెంటు అఖిలపక్షం సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించానని భరత్‌ విలేకరులకు చెప్పారు. ‘‘శీతాకాల సమావేశాల్లో సమయం వృథా చేయకుండా బిల్లులు, అంశాలపై చర్చ జరపాలని కోరాం. దిశ చట్టానికి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలపాలని విన్నవించాం. జీ-20 సారథ్యం లభించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన భాగస్వామ్యం కల్పించాలని కేంద్రాన్ని కోరతాం’’ అని మార్గాని భరత్‌ తెలిపారు. ప్రత్యేక హోదా వెనక్కి వెళ్లడానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబే కారణమని విమర్శించారు.

Updated Date - 2022-12-07T02:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising