ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నుల పండువగా శ్రీవారి రథోత్సవం

ABN, First Publish Date - 2022-10-05T08:37:59+05:30

కన్నుల పండువగా శ్రీవారి రథోత్సవం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటితో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

తిరుమల, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం వేంకటేశ్వరస్వామి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి ఊరేగుతూ భక్తుల మనోరథాన్ని నెరవేర్చారు. రథోత్సవంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్‌ రవీంద్రబాబు, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.శ్రీశానంద పాల్గొన్నారు. మంగళవారం రాత్రి అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీవారు కల్కి అవతారంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు అభయమిచ్చారు. అశ్వ వాహనసేవలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు..ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. బుధవారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన వేడుక జరగనుంది. బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.

Updated Date - 2022-10-05T08:37:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising