తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ కౌంటర్
ABN, First Publish Date - 2022-12-16T01:49:14+05:30
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం దేశ, విదేశాలనుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్‌లైన్ టికెట్ కౌంటర్‌ను తిరుపతి విమానాశ్రయంలో ఏర్పాటు చేసింది.
రేణిగుంట, డిసెంబరు 15: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం దేశ, విదేశాలనుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్‌లైన్ టికెట్ కౌంటర్‌ను తిరుపతి విమానాశ్రయంలో ఏర్పాటు చేసింది. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం గురువారం పూజలు చేసి కౌంటర్‌ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10వేలు విరాళమిచ్చి టికెట్ కోసం రూ.500 చెల్లించే భక్తులకు తిరుమలలో ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తున్నామని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు విమానాశ్రయంలోనే ఈ టికెట్లను జారీ చేస్తున్నామన్నారు.
Updated Date - 2022-12-16T01:49:15+05:30 IST