శ్రీశైలం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
ABN, First Publish Date - 2022-07-20T13:10:50+05:30
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 2,52,967 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 19,070 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.
నంద్యాల: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 2,52,967 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 19,070 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 876 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 168.2670 టీఎంసీలు కొనసాగుతుంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
Updated Date - 2022-07-20T13:10:50+05:30 IST