ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఔనన్నా.. కాదన్నా.. పోర్టు నిర్మిస్తాం

ABN, First Publish Date - 2022-07-07T05:09:34+05:30

‘మీరు అంగీకరించినా... లేకపోయినా పోర్టు నిర్మించి తీరుతాం. అవసరమైతే గోడ కట్టి మరీ నిర్మించగలం. ఎట్టిపరిస్థితుల్లో పోర్టు నిర్మాణం ఆగదు’.. అంటూ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గురువారం పోర్టు నిర్మాణంపై మూలపేటలో స్థానికులకు అవగాహనతో పాటు వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమానికి మంత్రి అప్పలరాజు, కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, టెక్కలి ఆర్డీవో హనుమంతు జయరాం హాజరయ్యారు. గ్రామస్థులతో చర్చించారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీదిరి అప్పలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 - మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలు చర్చనీయాంశం
- సమస్యలను ఏకరవు పెట్టిన మూలపేట గ్రామస్థులు
సంతబొమ్మాళి, జూలై 6:
‘మీరు అంగీకరించినా... లేకపోయినా పోర్టు నిర్మించి తీరుతాం. అవసరమైతే గోడ కట్టి మరీ నిర్మించగలం. ఎట్టిపరిస్థితుల్లో పోర్టు నిర్మాణం ఆగదు’.. అంటూ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గురువారం పోర్టు నిర్మాణంపై మూలపేటలో స్థానికులకు అవగాహనతో పాటు వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమానికి మంత్రి అప్పలరాజు, కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, టెక్కలి ఆర్డీవో హనుమంతు జయరాం హాజరయ్యారు. గ్రామస్థులతో చర్చించారు. సర్పంచ్‌ జీరు భీమారావు మాట్లాడుతూ పోర్టు నిర్మాణంతో జీవనోపాధి కోల్పోతామన్నారు. ప్రజాభీష్టం మేరకు ముందుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాస్త్రవేత్త జీరు దాలినాయుడు మాట్లాడుతూ పోర్టు ఏర్పాటుతో పర్యావరణ సమతుల్యానికి తీవ్ర ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని ఉప్పు రైతులు, ఆక్వా రైతులు జీవనోపాధి కోల్పోతారని చెప్పారు. చిత్తడి నేలల ఉనికి కోల్పోతుందన్నారు. గ్రామస్థులు పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దీనిపై స్పందించి మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ తొలుత మూలపేట, విష్ణుచక్రం గ్రామాలను విడిచిపెట్టి పోర్టు నిర్మాణం చేపట్టాలని అనుకున్నామని.. కానీ చిత్తడి భూములు కావడంతో ప్రమాదకరమని నిపుణులు తేల్చారని చెప్పారు. దేవునల్తాడ-భావనపాడు పోర్టు నిర్మాణానికి అంచనా వ్యయం రూ.4,200 కోట్లకు పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో మూలపేట తీరం అనుకూలమైందని నిపుణులు గుర్తించినట్టు తెలిపారు. అందుకే పోర్టు నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎకరా భూమికి రూ.18లక్షలు, కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన వారికి యూత్‌ ప్యాకేజీతో పాటు మెరుగైన పునరావాసం కల్పిస్తామన్నారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ మాట్లాడుతూ డ్రాఫ్ట్‌ పూర్తయిన వెంటనే నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. 433 ఎకరాల జిరాయితీలో సుమారు 300 ఎకరాలను ఈ నెలాఖరుకు స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు.

 


Updated Date - 2022-07-07T05:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising