ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తక్షణమే పనులు ప్రారంభించాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-12-13T23:46:04+05:30

జిల్లాలో మినరల్‌ ఫండ్స్‌ ద్వారా చేపట్టే పనులను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాకు మంజూరైన 582 పనుల్లో కొన్ని మాత్రమే పురోగతిలో ఉన్నాయన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరసవల్లి: జిల్లాలో మినరల్‌ ఫండ్స్‌ ద్వారా చేపట్టే పనులను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాకు మంజూరైన 582 పనుల్లో కొన్ని మాత్రమే పురోగతిలో ఉన్నాయన్నారు. మిగతావి 15 రోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 226 పనులు పూర్తి కాగా, ఆర్‌డబ్ల్యూ ఎస్‌లో అధికంగా 121 పనులు ప్రారంభించాల్సి ఉంద న్నారు. పనులు చేయకపోతే వాటి స్థానంలో కొత్తవి మంజూరు చేస్తామ న్నారు. హాస్టళ్ల వారెన్లతో చర్చించి కిచెన్‌ షెడ్ల్‌ కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఇంతవరకు ప్రారంభం కాని వంశధార-6 పనులు రద్దు చేయాలన్నారు. బిల్లులను వెంటనే అప్‌లోడ్‌ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో భూగర్భ గనులశాఖ డీడీ ఫణిభూషణ్‌ రెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈలు డోల తిరుమలరావు, సుధాకరరావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ సత్యనారాయణమూర్తి పాల్గొ న్నారు.

సచివాలయాల్లో సమస్యల పరిష్కారం

ఇచ్ఛాపురం: సచివాలయాల్లోనే సమస్యలు పరిష్కారం అవుతా యని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. మంగళవారం మునిసిపాలిటీ లోని 14,15 వార్డుల పరిధిలోని సచివాలయంలో శాఖల వారీగా సిబ్బం దితో మీక్షించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్యలను మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజల క్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్లు ఉలాల భారతి దివ్య, లాబాల స్వర్ణమణి కలెక్టర్‌కు వివరించారు. కాగా 12వ వార్డు బెల్లుపడ పరిధిలో గల అచ్చెంపేటలో గతంలో పార్క్‌ కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని బెల్లుపడ యూత్‌ సభ్యులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2022-12-13T23:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising