జీతాలు చెల్లించాలంటూ కార్మికుల నిరసన
ABN, First Publish Date - 2022-12-15T23:38:34+05:30
జీతాలు చెల్లించాంటూ టెక్కలి మేజర్ పంచాయతీతో పాటు మరో 20 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న రక్షిత నీటి పథకం కార్మికులు డిమాండ్ చేశారు.
టెక్కలి: జీతాలు చెల్లించాంటూ టెక్కలి మేజర్ పంచాయతీతో పాటు మరో 20 గ్రామాలకు తాగునీరు అందిస్తున్న రక్షిత నీటి పథకం కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తొమ్మిది నెలలుగా జీత భత్యాలు అందలేదని ఎమ్మెల్సీ మొదలుకొని సబ్‌కలెక్టర్ వరకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెబాట పడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు అనిల్‌కుమార్, సురేష్, ధర్మారావు, శ్రీను, ఉమేష్, రత్నాకర్, సీఐటీయూ నాయకులు నంబూరు షన్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:38:35+05:30 IST