వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధిపై దిశ కు మహిళ ఫిర్యాదు
ABN, First Publish Date - 2022-10-18T05:08:25+05:30
వజ్రపుకొత్తూరు మండలం గుణుపల్లి గ్రామానికి చెందిన ఓ వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధిపై అదే గ్రామానికి చెందిన మహిళ దిశ పోలీ సులకు సోమవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు ఫోన్‌చేసి దురుసుగా, అసభ్యంగా, భయపెట్టే విధంగా మాట్లాడినట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
వజ్రపుకొత్తూరు, అక్టోబరు 17: వజ్రపుకొత్తూరు మండలం గుణుపల్లి గ్రామానికి చెందిన ఓ వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధిపై అదే గ్రామానికి చెందిన మహిళ దిశ పోలీ సులకు సోమవారం సాయంత్రం ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది. తనకు ఫోన్‌చేసి దురుసుగా, అసభ్యంగా, భయపెట్టే విధంగా మాట్లాడినట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఊర్లో రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే బావుండదంటూ హెచ్చరించాడన్నారు. ఫోన్‌లో రికార్డు అయిన వాయిస్ మెసేజ్‌ను ఫిర్యాదుకు జత చేసింది. అలాగే రాత్రి వజ్రపుకొత్తూరు పోలీ సులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ వాయిస్ మెసెజ్ సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది. బాధిత మహిళ పోలీసు స్టేషన్‌కు వచ్చినప్పుడు తాను అందుబాటులో లేనని, దీంతో మంగళవారం ఉదయం స్టేషన్ రావాలని చెప్పామని వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు.
Updated Date - 2022-10-18T05:08:25+05:30 IST