ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లులు ఎందుకివ్వరు?

ABN, First Publish Date - 2022-11-24T23:37:30+05:30

‘రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లీనిక్‌ సెంటర్లపై ఉన్న ప్రేమ గ్రామాల అభివృద్ధిపై లేదు.

అధికారులను నిలదీస్తున్న సర్పంచ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రాధాన్యతా భవనాలపై ఉన్న ప్రేమ గ్రామాల అభివృద్ధిపై లేదా?

- సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీసిన సర్పంచ్‌లు

జి.సిగడాం, నవంబరు 24: ‘రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్‌ క్లీనిక్‌ సెంటర్లపై ఉన్న ప్రేమ గ్రామాల అభివృద్ధిపై లేదు. వాటిని నిర్మిస్తే బిల్లులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం గ్రామాల్లో నిర్మించిన కాలువలు, రోడ్లకు ఎందుకు ఇవ్వడం లేదు.’ అని మదుపాం, గొబ్బూరు, దేవరవలస, ఎందువ సర్పం చ్‌లు బి.అప్పలనాయుడు, ఎం.చిన్నారావు, వెంకటరావు, జోగినాయుడు, మెట్టవలస ఎంపీటీసీ సభ్యురాలు బెవర లక్ష్మి అధికారులను, నాయకులను నిలదీశారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ మీసాల సత్యవతి అధ్యక్షతన గురు వారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభించిన అరగంట వరకు గౌరవసభ్యులు రాకపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. పలు శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించి మమా అనిపించారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ.. మెటీరియల్‌ కాంపొనెట్‌కి సం బంధించి బిల్లులను సచివాలయాలు, ఆర్బీకేలకు చెల్లిస్తున్న అధికారులు గ్రామాల్లో రోడ్లు, కాలువల పనులకు చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. గ్రీన్‌ అంబాసిడర్‌లకు పంచాయతీల నుంచి వేతనాలు చెల్లించమనడం పద్ధతి కాదన్నారు. ఉపాధి గ్రామసభల్లో చేసిన తీర్మాణాలలో సర్పంచ్‌లు సంతకాలు పెట్టకపోతే పను లు చేయగలరా అని ప్రశ్నించారు. ఇకపై గ్రామసభల్లో సంతకాలు పెట్టమని తేల్చిచె ప్పారు. సమస్యలు పరిష్కరించిన ఈ సమావేశాలు ఎందుకన్నారు. ఖరీఫ్‌లో మడ్డు వలస జలాశయం నుంచి నీరు విడిచిపెట్టండి మహా ప్రభో అని రైతులు వేడుకున్నా అధికారులు పట్టించుకోలేద న్నారు. ఇప్పుడు అవసరం లేకపోయినా నీరు విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. రైతుల నుంచి సేకరించిన డబ్బులతోనే సాగునీటి కాలువ లకు మరమ్మతులు చేసుకున్నామని సభ్యులు తెలిపారు.సభ్యుల ప్రశ్నలకు సమాఽ దానం చెప్పలేక ఇదేం ఖర్మ - ఇదేం ప్రభుత్వం అంటూ రెండు చేతులు జోడించి జడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ నమస్కారం పెట్టారు. మండల ప్రత్యేక ఆహ్వాని తుడు మీసాల వెంకటరమణ మాట దాటవేశారు. ఈ సమావేశంలో వైస్‌ ఎంపీపీలు మీసాల సాధ్వీమణి, టి.వెంకటరావు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీడీవో ఎస్‌.శ్రీనివాసులు, తహసీల్దార్‌ పప్పల వేణుగోపాలరావు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:37:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising