బీసీలకు చేసిందేమిటి?
ABN, First Publish Date - 2022-12-07T00:01:28+05:30
వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిందేమిటని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్ ప్రశ్నించారు. బీసీలను నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ ఆమదాలవలస తహసీల్దారు కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు బైఠాయించాయి. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలను దారుణంగా అన్యాయం చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీల అభ్యున్నతికి రాయితీలు, పథకాలు అమలుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. చేతివృత్తుల వారికి ఆదరణ పథకం ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు.
బీసీలకు చేసిందేమిటి?
టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్
ఆమదాలవలస, డిసెంబరు 6: వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిందేమిటని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్ ప్రశ్నించారు. బీసీలను నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ ఆమదాలవలస తహసీల్దారు కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు బైఠాయించాయి. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలను దారుణంగా అన్యాయం చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీల అభ్యున్నతికి రాయితీలు, పథకాలు అమలుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. చేతివృత్తుల వారికి ఆదరణ పథకం ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు మళ్లించారని.. కార్పొరేషన్లు రాజకీయ నిరుద్యోగానికి తప్ప.. బీసీలకు ఒరిగిందేమిటి లేదన్నారు. అనంతరం డీటీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు అనెపు రామకృష్ణ, శివ్వాల సూర్యం, మొదలవలస రమేష్, తమ్మినేని విద్యాసాగర్, నూకరాజు, తమ్మినేని అమర్‌నాథ్, సంపతిరావు మురళీరావు, తమ్మినేని సుజాత, అన్నెపు రాము, కేవీ సత్యనారాయణ, లావేటి పూర్ణారావు, బీవీ రమణమార్తి పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T00:01:30+05:30 IST