ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలక మండళ్లు ఏవీ?

ABN, First Publish Date - 2022-12-16T23:28:23+05:30

దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు పాలకమండళ్ల నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆలయాలకు కమిటీలు ఉంటే కొంతమేర అభివృద్ధితో పాటు అధికారులపై పర్యవేక్షణ ఉంటుంది.. అయితే ఆ దిశగా చర్యలు లేకపోవడంతో ఆలయాల పర్యవేక్షణ కానరా వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పాలక మండలి లేని రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇదీ దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల తీరు

టెక్కలి: దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు పాలకమండళ్ల నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆలయాలకు కమిటీలు ఉంటే కొంతమేర అభివృద్ధితో పాటు అధికారులపై పర్యవేక్షణ ఉంటుంది.. అయితే ఆ దిశగా చర్యలు లేకపోవడంతో ఆలయాల పర్యవేక్షణ కానరా వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రసిద్ధ శైవ క్షేత్రం రావివలస లోని ఎండల మల్లికార్జున దేవాలయంతో పాటు డివిజన్‌ కేంద్రమైన టెక్కలిలో లక్ష్మణ బాలాజీ, గోపాల జగన్నాథ, లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల కమిటీ నియామకాలు గడువు ముగిసినా కొత్తగా చేపట్టడం లేదు. దీంతో ఆలయాల్లో ఉత్సవాల నిర్వహణలోనూ నిర్లక్ష్యం కొట్టొచ్చి నట్లు కనిపిస్తోంది. జిల్లాలో 6ఏ కింద ఏడాదికి రూ.25 లక్షల ఆదాయం దాటిన ఆలయాలు ఐదు, 6బి కింద ఏడాదికి రూ.5 లక్షల ఆదాయం దాటిన ఆలయాలు 19, 6సీ కింద ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం వచ్చే ఆలయాలు 48 ఉన్నట్లు దేవదాయశాఖ గుర్తిం చింది. ఆలయాలు అభివృద్ధి చెందాలంటే ఆలయ కమిటీదే కీలకపాత్ర. ఆలయ అభి వృద్ధి పర్యవేక్షణ, నిధులు సేకరణ, ఉత్సవాల నిర్వహణ తదితర కార్యక్రమాలు ఆలయకమిటీ ఆధ్వర్యంలోనే చేపట్టాల్సి ఉంది. కమిటీల నియామకాలన్నీ అధికార పార్టీకి చెందిన సిఫారసు లేఖలతోనే నియామకం చేపడతారు. అయితే నేటికీ ఈ ఆలయాలతో పాటు జిల్లాలో పలు ప్రధాన ఆలయా లకు కమిటీల నియామకం నేటికీ చేపట్టలేదు. దీనిపై ఇన్‌చార్జి ఏసీ డీవీవీ ప్రసాదరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా కొన్ని ఆలయాలకు నోటిఫికేషన్లు జారీ చేశా మని, మరికొన్ని ఆలయాలకు నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉందన్నారు. ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-12-16T23:29:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising