పోర్టుకు రోడ్డు నిర్మాణంతో ఉపాధి కోల్పోతాం
ABN, First Publish Date - 2022-10-18T05:07:39+05:30
భావనపాడు పోర్టుకు సంబంధించి రఘు నాథపురం నుంచి రాజపురం వరకు నిర్మించనున్న 300 అడు గుల రోడ్డు నిర్మాణం వల్ల తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డు న పడతామని ఆయా గ్రామాల చిన్న, సన్న కార రైతులు ఆవే దన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు
సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతుల ధర్నా
టెక్కలి: భావనపాడు పోర్టుకు సంబంధించి రఘు నాథపురం నుంచి రాజపురం వరకు నిర్మించనున్న 300 అడు గుల రోడ్డు నిర్మాణం వల్ల తామంతా ఉపాధి కోల్పోయి రోడ్డు న పడతామని ఆయా గ్రామాల చిన్న, సన్న కార రైతులు ఆవే దన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దాలిచెరువు, పురు షోత్తమసాగర్, వంశధార కాలువల కింద ఉన్న భూములతో రెండు పంటలు పండించుకొని జీవనం సాగిస్తున్నామన్నారు. పోర్టు పేరుతో కొత్తగా రోడ్డు ఏర్పాటుకు అధికారులు చేస్తున్న సర్వే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ పి.రాహుల్‌కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నంబూరు షణ్ముఖరావు, కూర్మారావు, ధర్మారావు, రామకృష్ణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:07:39+05:30 IST