ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీతోనే ఉంటాం.. మీ వెంటే నడుస్తాం

ABN, First Publish Date - 2022-06-27T06:17:31+05:30

మీతోనే ఉంటాం.. మీవెంటే నడుస్తామని దళిత యువకులు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డితో అన్నారు.

కార్యకర్తలతో మాట్లాడుతున్న ఉగ్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీతోనే ఉంటాం.. మీ వెంటే నడుస్తాం

కనిగిరి, జూన్‌ 26 : మీతోనే ఉంటాం.. మీవెంటే నడుస్తామని దళిత యువకులు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డితో అన్నారు. ఆదివారం వెలిగండ్ల మండలానికి చెందిన 100 యువకులు మర్యా దపూర్వకంగా కలిశారు. వారంతా పార్టీలో చే రేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యా ప్తంగా దళితులపై వేధింపులు, దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఆగడాలను, ప్రజా వ్యతిరేక విధా నాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, వచ్చే ఎన్ని కల్లో టీడీపీ విజయానికి పాటుపడతామని యువకులు ఉగ్రకు తెలిపారు. బైబిల్‌ పట్టుకుని దళితుల్లో సానుభూతి ఓట్లు దండుకున్న జగన్‌ రెడ్డికి గుణపాఠం చెప్తామన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా మీరు మాకు అన్ని సమయా ల్లో అండగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో మా బలమేంటో చూపిస్తామన్నారు. గ్రామాల్లో వైసీ పీ నేతల అరాచకాలు ఎక్కువయ్యాయని, దళితుల భూములను కూడా ఆక్రమించుకుం టున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అడిగేవారిపై  తప్పుడు కేసులు పెట్టి భయ బ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. వచ్చే ఎన్ని కల్లో మీకు అండగా ఉండి గెలిపించుకుంటా మని అందుకు బేషరతుగా 21 పంచాయతీల దళితులంతా మద్దతుగా ఉంటామని ప్రకటిం చారు. అనంతరం డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ అణగారిన వారి అభ్యున్నతే టీడీపీ విధాన మన్నారు. దళితులకు అండగా నిలబడతానని, మీరు ఏ ఆపదలో ఉన్నా ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే మీ ముందుంటానన్నారు. వైసీపీ వ్యతిరేక విధా నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు టీడీపీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయా లని ఉగ్ర యువకులను కోరారు. ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వాలను తీసుకోవాలని తద్వారా కలి గే ప్రయోజనాలను ఉగ్ర వివరించారు. సమా వేశంలో టీడీపీ వెలిగండ్ల మండల అధ్యక్షుడు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, సలోమన్‌రాజు, గోనా ప్రతాప్‌, ఇంద్రభూపాల్‌రెడ్డి, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T06:17:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising