ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ పాలకవర్గ సమావేశం రచ్చ రచ్చ

ABN, First Publish Date - 2022-06-25T05:30:00+05:30

టెక్కలి మేజర్‌ పంచాయతీ పాలకవర్గ సమావేశం శనివారం రచ్చరచ్చగా సాగింది. వార్డు సభ్యులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తుపోసుకున్నారు. వైసీపీలో ఉన్న అంతర్గత పోరు బయటపడింది. సర్పంచ్‌ గొండేల సుజాత అధ్యక్షతన నిర్వహించిన సమావేశాని

సమావేశంలో వాదించుకుంటున్న సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్గాలుగా విడిపోయిన వార్డు సభ్యులు

టెక్కలి/టెక్కలి రూరల్‌, జూన్‌ 25: టెక్కలి మేజర్‌ పంచాయతీ పాలకవర్గ సమావేశం శనివారం రచ్చరచ్చగా సాగింది. వార్డు సభ్యులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తుపోసుకున్నారు. వైసీపీలో ఉన్న అంతర్గత పోరు బయటపడింది. సర్పంచ్‌ గొండేల సుజాత అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎంపీపీ అట్ల సరోజినమ్మ, ఉప సర్పంచ్‌ గండి విశ్వశాంతిరెడ్డి, ఈవో వినోద్‌కుమార్‌తో పాటు వార్డు సభ్యులు హాజరయ్యారు. 14వ వార్డు సభ్యులు దాడి ధర్మారావు శుక్రవారం పంచాయతీ పాలకవర్గానికి వ్యతిరేకం గా సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టింగులు చర్చకు వచ్చాయి. వార్డు సభ్యుడి తీరుపై తోటి సభ్యులు ఆక్షేపిం చారు. దీంతో వాదనలు ప్రారంభమయ్యాయి. వార్డు సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. దూషణలపర్వానికి దిగారు. పంచాయతీ తీర్మానం, ఆమోదం లేకుండా పట్టుమహాదేవి కోనేరుగట్టుపై షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం ఎలా చేపడతా రంటూ దాడి ధర్మారావు ప్రశ్నించారు. దీనిపై 4వ వార్డు సభ్యురాలు దుప్పల మోహిని భర్త దుప్పల శ్రీనివాస్‌, 9వ వార్డు సభ్యుడు ఆట్ల రమణమూర్తి అభ్యంతరం చేశారు. అయితే దీనిపై మరో సభ్యుడు రాజేశ్వరరావు స్పందించారు. సభ్యులు కాని వారు సమావేశంలో మాట్లాడడం ఏమిటని ప్రశ్నించడంతో సమావేశం ఒక్కసారిగా రసాభాసగా మారిం ది. దీనిపై సర్పంచ్‌ సోదరుడు, ఆర్టీసీ ఉద్యోగి అయిన బస వల ధనుంజయరావు స్పందించారు. సభ్యుడు రాజేశ్వరరావు వ్యవహార శైలి తగదని.. మిగతా సభ్యులు ఏమైనా కళ్లు మూసుకున్నారా అని ప్రశ్నించారు. వారికి లేని అభ్యంతరం మీకెందుకు వచ్చిందంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పట్టణాభివృద్ధికి కృషిచేస్తుంటే మరోవైపు సభ్యులు ఇలా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తం చేశారు. కాగా సమస్యలు పరిష్కరించని సమావేశాలెం దుకంటూ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. 20 వ వార్డు సభ్యుడు తోట లోకేష్‌ మాట్లాడుతూ తన వార్డు పరిధిలో ఏం జరుగుందో తనకు తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ పైప్‌లైన్‌ కనెక్షన్లపై ప్రశ్నిస్తే తనపై పలువురు దాడి చేశారని వాపోయారు. సీసీరోడ్ల నిర్మాణం బిల్లుల చెల్లింపులో ఏడాదిన్నరగా జరుగుతున్న జాప్యంపై వార్డుసభ్యులు నూనెల సోమేశ్వరరావు, ఆట్ల రమణమూర్తిలు ప్రశ్నించారు. కాగా సమావేశానికి వార్డు సభ్యుల కుటుంబసభ్యులు, బంధువులు హాజరుకావడం విమర్శలకు తావిచ్చింది.




Updated Date - 2022-06-25T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising