గ్రామాల్లో నిఘా పెంచాలి
ABN, First Publish Date - 2022-12-07T23:28:48+05:30
ప్రతిరోజూ పోలీసు సిబ్బంది గ్రామాలను సందర్శించి నిఘా పెంచాలని ఎస్పీ జీఆర్ రాధిక స్పష్టం చేశారు. కాశీబుగ్గ రూరల్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేర నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అనుమానితులపై నిఘా పెట్టి వారి కదలికలు పరిశీలి స్తుండాలన్నారు.
పలాస, డిసెంబరు 7: ప్రతిరోజూ పోలీసు సిబ్బంది గ్రామాలను సందర్శించి నిఘా పెంచాలని ఎస్పీ జీఆర్ రాధిక స్పష్టం చేశారు. కాశీబుగ్గ రూరల్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేర నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, అనుమానితులపై నిఘా పెట్టి వారి కదలికలు పరిశీలి స్తుండాలన్నారు. రాత్రులు, జనసంచారం లేని ప్రాంతాల్లో గస్తీ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగు తున్నాయని, వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. హైవేపై పెట్రోలింగ్ వాహన సిబ్బంది అప్రమ త్తంగా ఉండాలని, ప్రమాదాలు జరగకుండా చూడాల న్నారు. రోడ్డు భద్రత చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రికార్డుల నిర్వహణను పరిశీలించారు. కాశీబుగ్గ డీఎ స్పీ ఎం.శివరామిరెడ్డి, సీఐ జి.శంకరరావు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:28:50+05:30 IST