ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో వెటర్నరీ అంబులెన్స్‌లు

ABN, First Publish Date - 2022-03-05T04:29:28+05:30

పశువులకు తక్షణ వైద్యం కోసం త్వరలో వెటర్నరీ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల(చిలకపాలెం)లో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ప్రభుత్వ పశువైద్యుల క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లను నియమిస్తామన్నారు. ‘340 అంబులెన్స్‌ల ద్వారా పశువులకు మొబైల్‌ సేవలందిస్తాం. ప్రతి సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మెరుగైన సేవలందిస్తున్నాం.

మాట్లాతున్న మంత్రి డాక్టర్‌ అప్పలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంత్రి సీదిరి అప్పలరాజు 

 పశు వైద్యుల క్రికెట్‌ పోటీలు ప్రారంభం

ఎచ్చెర్ల, మార్చి 4: పశువులకు తక్షణ వైద్యం కోసం త్వరలో వెటర్నరీ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల(చిలకపాలెం)లో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ప్రభుత్వ పశువైద్యుల క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్లను నియమిస్తామన్నారు. ‘340 అంబులెన్స్‌ల ద్వారా పశువులకు మొబైల్‌ సేవలందిస్తాం. ప్రతి సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మెరుగైన సేవలందిస్తున్నాం. చనిపోయిన పశువులకు  సంబంధించి బాధిత రైతులకు వీలైనంత త్వరలో పరిహారం అందిస్తాం. తొలుత విశాఖపట్నం.. తర్వాత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రారంభిస్తాం. పశు సంజీవని ద్వారా పశువైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామ’ని మంత్రి అప్పలరాజు తెలిపారు. స్థానిక శాసనసభ్యుడు గొర్లె కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పశువైద్యులు క్రీడల్లో కూడా నైపుణ్యం సాధించాలన్నారు.  కార్యక్రమంలో పశు సంవర్ధకశాఖ జేడీ ఎం.కిశోర్‌, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌, ఎంపీపీ మొదలవలస చిరంజీవి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ మాడుగుల రూపవతి, కళింగ వైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అంధవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-05T04:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising