ప్రోత్సాహకాలను వినియోగించుకోండి
ABN, First Publish Date - 2022-12-15T23:36:02+05:30
రాయితీలపై ఇచ్చే ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని ఉద్యానవనశాఖ జిల్లా అఽధికారి ఆర్‌వీవీ వరప్రసాదరావు అన్నారు.
పాతపట్నం: రాయితీలపై ఇచ్చే ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని ఉద్యానవనశాఖ జిల్లా అఽధికారి ఆర్‌వీవీ వరప్రసాదరావు అన్నారు. ప్రహరాజపాలెం గ్రామ పరిధిలో బ్రెడ్స్ కార్యాలయం చేరువలో సంస్థ చేపట్టిన ఉద్యానవనశాఖ ఉత్పత్త్తుల నిలువ కేంద్రం నిర్మాణాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా ఉద్యానవన ఉత్పత్తుల కలెక్షన్ సెంటర్ నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేస్తామన్నారు. బ్యాంక్ రుణాలు కూడా పొందవచ్చన్నారు. దీనిలో రూ11.25 లక్షలు రాయితీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉద్యావనశాఖాధికారిణి మంగమ్మ, బ్రెడ్స్ కోఆర్డినేటర్ బండి ఆనంద్, రైతు ఉత్పత్తిదారుల సంఘాల డైరెక్టర్‌లు రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:36:03+05:30 IST