ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వణుకు పుట్టిస్తున్న వాతావరణం

ABN, First Publish Date - 2022-11-25T23:21:15+05:30

నాలుగైదు రోజుల నుంచి వాతావరణంలో మార్పులతో పాటు తేలికపాటి చినుకులు పడుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆరుగాలం కష్టపడి పెట్టుబడులు పెట్టి పండించిన వరి పంట చేతికందే సమ యంలో అల్పపీడనం కారణంగా వాతావరణంలో మార్పులు సంభవించి పంట లకు నష్టం చేకూరే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.

చింతలబడవంజ సమీపంలో పొలంలో కుప్పలుపెడుతున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్‌.ఎన్‌.పేట: నాలుగైదు రోజుల నుంచి వాతావరణంలో మార్పులతో పాటు తేలికపాటి చినుకులు పడుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఆరుగాలం కష్టపడి పెట్టుబడులు పెట్టి పండించిన వరి పంట చేతికందే సమ యంలో అల్పపీడనం కారణంగా వాతావరణంలో మార్పులు సంభవించి పంట లకు నష్టం చేకూరే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. పొలాల్లో పంట ను ఉంచలేక, ఇంటికి తీసుకురాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముమ్మ రంగా కోతలు కోసి పొలాల్లోనే వరి పనప (ఓవు)లతో ఉన్నందున ఏ మాత్రం వర్షం పడినా తీరని నష్టం వాటిల్లుతుందని తురకపేట, దబ్బపాడు, చింతల బడవంజ, శ్యామలాపురం, ధనుకువాడ, కోవిలాం, రావిచెంద్రి, వాడవలస, మిరియాపల్లి తదితర గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కోసిన వరి చేలు ఎండకుండా కుప్పలు పెడితే కుళ్లిపోయి ధాన్యం రంగు మారిపోయే ప్ర మాదం ఉందని వారు పేర్కొంటున్నారు. దీంతో పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు.

Updated Date - 2022-11-25T23:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising