ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో ఉన్నత స్థాయికి

ABN, First Publish Date - 2022-12-16T23:21:13+05:30

యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థా నాలకు చేరుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అన్నారు.

క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలు ప్రారంభిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌

- జోనల్‌ స్థాయి వాలీబాల్‌ పోటీలు

అరసవల్లి: యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థా నాలకు చేరుకోవాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ అన్నారు. శుక్రవారం స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో శాప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జోనల్‌ స్థాయి సీఎంకప్‌ ప్రైజ్‌మనీ వాలీబాల్‌ టోర్నమెంట్‌ పోటీలను క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ.. క్రమశిక్షణ, పట్టుదలతో కూడిన సాధన చేస్తే గొప్ప ఫలితాలు సాధించవచ్చన్నారు. సచిన్‌, కోహ్లి వంటి క్రీడాకారులు తక్కువ చదువుకున్నా క్రీడల్లో సత్తా చాటి ప్రపంచ స్థాయికి ఎదిగారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ టోర్నమెంట్‌లో శ్రీకాకుళం, విజయ నగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, పాడేరు జిల్లాల నుంచి 17 ఏళ్ల వయసు పైబడిన మహిళా, పురుష క్రీడాకారులు పాల్గొన్నారు. తొలుత క్రీడాస్ఫూర్తితో ఉత్తమ ప్రదర్శన చేస్తామని క్రీడాకారులతో కలెక్టర్‌ ప్రమాణం చేయిం చారు. ఈ టోర్నమెంట్‌లో గెలుపొందిన టీమ్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అధిక ప్రాధా న్యం ఇస్తున్నాయని, ఈ అవకాశాలను క్రీడాకారులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శాప్‌ చైర్మన్‌ ప్రసాదరావు, జిల్లా చీఫ్‌కోచ్‌ మాధురీలత, ఆరు జిల్లాలకు చెందిన క్రీడా ప్రతినిధులు, క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising