ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యం

ABN, First Publish Date - 2022-12-07T00:03:15+05:30

పోలీసు శాఖలో కీలకమైన హోంగార్డుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ జీఆర్‌ రాధిక తెలిపారు. హోంగార్డుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదా నంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చైనా యుద్ధం తర్వాత పోలీసులతో సమానంగా కలిసి పనిచేసేందుకు హోంగార్డు వ్యవస్థ స్వచ్ఛందంగా ఆవిర్భవించిందని చెప్పారు.

మాట్లాడుతున్న ఎస్పీ రాధిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యం

ఎస్పీ జీఆర్‌ రాధిక

ఎచ్చెర్ల, డిసెంబరు 6: పోలీసు శాఖలో కీలకమైన హోంగార్డుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ జీఆర్‌ రాధిక తెలిపారు. హోంగార్డుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఎచ్చెర్లలోని సాయుధ పోలీసు మైదా నంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చైనా యుద్ధం తర్వాత పోలీసులతో సమానంగా కలిసి పనిచేసేందుకు హోంగార్డు వ్యవస్థ స్వచ్ఛందంగా ఆవిర్భవించిందని చెప్పారు. జిల్లాలో 1965లో ప్రారంభమైన ఈ వ్యవస్థ ద్వారా 739 మంది సేవలందిస్తున్నారని తెలిపారు. వారికి ఇచ్చే గౌరవ వేతనం తక్కువైనప్పటికీ పోలీసులతో సమానంగా సేవలందిస్తున్నారని పేర్కొ న్నారు. కమాండర్‌ శశికుమార్‌ ఆధ్వర్యంలో హోంగార్డులు పరేడ్‌ నిర్వహిం చగా.. ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. తొలుత శాంతికి చిహ్నంగా పావురాన్ని ఎస్పీ విడిచిపెట్టారు. కార్యక్రమంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జేడీ వీఎన్‌ మణికంఠ, అదనపు ఎస్పీ టీపీ విఠ లేశ్వరరావు, డీఎస్పీలు ఎస్‌.బాలరాజు, జి.శ్రీనివాసరావు, సీహెచ్‌.ప్రసాదరావు, ఆర్‌ఐలు ప్రదీప్‌, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising