ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పైశాచిక ఆనందానికే వర్సిటీ పేరుమార్పు

ABN, First Publish Date - 2022-10-18T04:49:48+05:30

పైశాచిక ఆనందానికే వర్సిటీ పేరుమార్పు

సోంపేట: రిలేదీక్ష చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన

- ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ధ్వజం

సోంపేట: పాలనపై వస్తున్న వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి సీఎం జగన్‌ యూనివర్సిటీలకు పేర్లుమార్చి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ధ్వజమెత్తారు.  సోమవారం సోంపేట పట్టణంలో ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్చడానికి వ్యతిరేకంగా రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అస్తవ్యస్త, తిరోగమన పాలన సాగుతోందని ఆరోపించారు. ఆంరఽధుల ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ పేరును మార్చినంతమాత్రాన ప్రజల్లో ఆయన పరపతిపోదని, దీనికి తగిన జవాబు ఎన్నికల్లో చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీక్షలో టీడీపీ నాయకులు జీకే నాయుడు, చిత్రాడ శ్రీనివారావు, సూరాడ చంద్రమోహన్‌, మద్దిల నాగేశ్‌, తమరాల శోభన్‌, మాదిన రామారావు, బుడ్డెపు కామేష్‌రెడ్డి, సీపాన వెంకరమణ, పూర్ణ చంద్రరావు పాల్గొన్నారు.


దీక్షలకు సంఘీభావం

ఇచ్ఛాపురం: ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ  పేరు మార్పునకు నిరసనగా సోంపేటలో చేపట్టిన రిలే దీక్షకు ఇచ్ఛాపురం పట్టణ టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. జిల్లా టీడీపీ పార్లమెంటరీ మహిళా ప్రధాన కార్యదర్శి, 11వ వార్డు కౌన్సిలర్‌ ఆశి లీలారాణి, తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ల జయదేవ్‌, నాయకులు మహ్మద్‌ జిలానీ, నందిగాం కోటి, సంతోస్‌ దీక్షలో పాల్గొన్నారు.


వైసీపీది అవినీతి వికేంద్రీకరణ

- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా

జి.సిగడాం: వైసీపీ ప్రభుత్వం అవినీతి వికేంద్రీకరణకు పాల్పడుతోందని మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు ఆరో పించారు. శస్త్రచికిత్స చేయించుకున్న నాగులవలస టీడీపీ నాయకుడు, రిటైర్డు ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పడాల అప్పన్న మాస్టార్‌ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లా డారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అవి నీతికి తావిస్తుందని విమర్శించారు. తుగ్లక్‌ ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా మూడు రాజధానుల వ్యవహారాన్ని తెచ్చారని దుయ్యబట్టారు. వైసీపీ నేతల కన్ను లక్షల కోట్ల విలు వైన విశాఖ భూములపై పడిందని ఆరోపించారు. ఉత్తరాంద్ర అభివృద్ధిని పక్కన పెట్టి ప్రజలకు మాయమాటలు చెపుతున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అ డ్డుకోవడంలో అధికార వైసీపీ నేతలు విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచ కపాలన రాజ్యమేలుతుందని ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒక్క చాన్సు ఇచ్చి తప్పుచేశామని ప్రజలు బాధ పడుతున్నారన్నారు. సామా న్యులు బతకలేని స్థాయికి రాష్ట్రంలో పరిస్థితులు తయార య్యాయన్నారు. జగన్‌రెడ్డి చే తిలో మంత్రులు, ఎమ్మెల్యేలు కీలుబొమ్మలుగా మారారన్నారు. పార్టీ నాయకులు కుమరాపు రవికుమార్‌, సిగటాపు గోవిందరావు, పడాల తవుడమ్మ, శ్రీనివాసరావు, రామకృష్ణ, మౌళీశ్వరరావు, వీవీ గోపాలరావు పాత్రో, కాశి, బివర జగన్నాఽథరావు, ఎన్‌.మురళి, సత్యారావు, గొల్లాజీ, అప్పలనాయుడు, చిన్నంనాయుడు సూరిబాబు  తదితరులు ఉన్నారు. 


అవినీతి రాజకీయాలను ప్రోత్సహించొద్దు

- మాజీ మంత్రి గుండ  

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి: అవినీతి రాజకీయాలను ప్రజలు ప్రోత్సహించొద్దని మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకులు గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లా డారు. ప్రస్తుతం అధికారంతో అక్రమార్జన పొందే అలవాటుగా కొందరికి మారిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అర్ధవంతం చేయాలంటే విద్యావంతులు, యువత ముం దుకురావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో చట్టసభలు, ఎగ్జిక్యూటీవ్‌, న్యాయవ్యవస్థ ఉన్నా అంతిమంగా ప్రజలదే తుది నిర్ణయమన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు గుత్తు చిన్నారావు, వెంకటరామరాజు, ఇప్పిలి రమణ పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-18T04:49:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising