ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గతుకుల రోడ్లపై ఒళ్లు హూనం

ABN, First Publish Date - 2022-07-21T04:58:11+05:30

ఉమ్మడి జిల్లా రోడ్లు భవనశాఖ శాఖ పరిధిలో అధికా రులు గుర్తించిన 104 రోడ్ల (767 కిలోమీటర్లు) మర మ్మతులకు గత ఏడాది ఏప్రిల్‌లో రూ. 170.34 కోట్లు కేటాయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడాదైనా పూర్తికాని ఆర్‌అండ్‌బీ  రోడ్ల పనులు

ఛిద్రమైన రోడ్లతో ప్రజలకు తప్పని అవస్థలు

అరకొర బిల్లులతో ముందుకురాని కాంట్రాక్లర్లు 


అనంతపురం సిటీ : ఉమ్మడి జిల్లా రోడ్లు భవనశాఖ శాఖ పరిధిలో అధికా రులు గుర్తించిన 104 రోడ్ల (767 కిలోమీటర్లు) మర మ్మతులకు గత ఏడాది ఏప్రిల్‌లో రూ. 170.34 కోట్లు కేటాయించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల మరమ్మతులకు మొదటగా కేటాయించిన నిధులు కూడా ఇవే. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో మాదిరిగానే ఈ ప్రభుత్వంలో కూడా పనులు వేగంగా సాగుతాయని అందరూ భావించారు. అయితే క్షేత్రస్థాయిలో ఈ పనుల పరిస్థితి భిన్నంగా తయారైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ కాంట్రాక్టు పనులకు సంబంధించి ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకురాలేదు. ఇదే క్రమంలో ఈ కాంట్రాక్టు పనులకు కూడా అధికారులు టెండర్లు పిలిచిన సుమారు 3 నెలలకు పైగా ముందుకు రాని పరిస్థితి ఉమ్మడి జిల్లాలో ఏర్పడిందని అధికార వర్గాల సమాచారం. ఆ తర్వాత ఒక్కొక్కటిగా.. ఉమ్మడి జిల్లాలో పనులు మొదలయ్యాయి. ఆయితే ఇప్పటి వరకు  104 రోడ్లలో 81 రోడ్ల(767 కిలోమీటర్లు) పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. మిగిలిన 23 రోడ్ల (163.81 కిలోమీటర్లు)మరమ్మతుల పనులు ఇప్పటికి పెండింగ్‌లోనే ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.  


   దృష్టి సారించని అధికారులు...

రోడ్ల మరమ్మతులకు సంబంధించి టెండర్లు పొంది పనులు అలసత్వంగా చేస్తున్నా ఆశాఖ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఏమైనా కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే.. బిల్లులు కాలేదు. ఏమీ చేయాలని నిలదీస్తున్నట్లు అధికార వర్గాల నుంచి తెలిసింది. దీంతో అధికారులు కూడా మిన్నుకుండినట్లు సమాచారం. ప్రధానంగా కళ్యాణదుర్గం, ధర్మవరం డివిజనలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని సమాచారం. అనంతపురం డివిజనలో కూడా అక్కడక్కడ ఇదే పరిస్థితే.  గతంలో ఏదైనా కాంట్రాక్టు చేయాలంటే రాజకీయ సిఫార్సు లతో పాటు ప్రజాప్రతినిధుల అండదండలు, పోటీ తీవ్రత ఉండేది. కానీ వైసీపీ ప్రభుత్వంలో బిల్లుల గోడుతో ఎక్కడికక్కడ పనులు అసంపూర్తిగా ఆగిపోవడంతో పాటు ముందుకువచ్చే కాంట్రాక్టరే దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. 


పెండింగ్‌లోనే  25శాతం పనులు...

రహదారులు, భవనాశాఖ పరిధిలోని రోడ్ల మరమ్మతులు ఆశించిన స్థాయిలో ముందుకుసాగడం లేదు. ప్రధానంగా ధర్మవరం, గుంతకల్లు, మడకశిర, ఉరవకొండ, శింగనమల, రాప్తాడు తదితర ప్రాంతాలలో ఆర్‌అండ్‌బీ రోడ్ల పరిస్థితి ఆధ్వానంగా ఉందని సమాచా రం. అధికారులు గుర్తించిన 104 రోడ్లలోనే ఇప్పటికీ 25శాతం రోడ్లు మరమ్మతులు ఏడాదికిపైగా  పెండిండ్‌లో ఉండటం విమర్శలకు తా విస్తోంది. గతంలో ఆశాఖ అధికారులు జూనలోపు గత ఏడాది రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం.  


ఛిద్రమైన రోడ్లతో తప్పని తిప్పలు...

ఉమ్మడి జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పాటు ఈ ఏడాదిలో కురిసిన వర్షాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రహదారులు ఎక్కడికక్కడ గుంతలమయమయ్యాయి. వర్షాలు కురిసిన సమయంలో ఆ రహదారుల గుండా ప్రయాణాలు చేయడం వాహనాచోదకులకు నరక ప్రాయంగా మారుతోంది. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ఆర్‌అండ్‌బీ  ప్రధాన రోడ్ల పరిస్థితే ఇలా ఉంటే.. గ్రామీణా, మండల ప్రాంతా ల రహదారుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 


అరకొర బిల్లులతోనే...

రోడ్ల మరమ్మతు పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు వేగవంతం చేయడంలేదు. పనులు చేసి నెలలు గడిచిన బిల్లులు రాకపోవడంతో కొందరు కాంట్రాక్లర్లు పనులు మధ్యలోనే నిలిపేశారు. మరికొందరు అధికారుల ఒత్తిళ్లతో నత్తనడకన  సాగిస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించి రూ. 128.66 కోట్లు బిల్లులు పెట్టగా.. 70శాతం బిల్లులు వచ్చినట్లు సమాచారం. మిగిలిన బిల్లులు కోసం కాంట్రాక్టర్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. మిగిలిన  25శాతం చేయాల్సిన పనులకు సంబంధించి కొందరు కాంట్రాక్టర్లు పాత బిల్లులు వస్తే తప్ప పనులు చేయమని మొండికేసినట్లు ఆశాఖ వర్గాల ద్వారా తెలిసింది.  


25శాతం పనులు చేయాల్సి ఉంది

- ఓబుల్‌రెడ్డి,  ఎస్‌ఈ, ఆర్‌అండ్‌బీ

ఉమ్మడి జిల్లా పరంగా గత ఏడాదికి సంబంధించి రోడ్ల మరమ్మతుల్లో 25శాతం పనులు ఇంకా జరగాల్సి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకున్నాం. బిల్లుల సమస్య కూడా ఉంది. ఉన్నతాధికారులకు నివేదించాం. కాంట్రాక్టర్లు వేగంగా పనులు చేసే లా చూస్తాం. దెబ్బతిన్న రోడ్లను త్వరగా బాగుచేస్తాం. ఈ ఏడాదికి సంబంధించి కూడా రోడ్ల మరమ్మతు పనులకు ఉమ్మడి జిల్లా పరంగా రూ. 65 కోట్లు కావాలని ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. రోడ్ల మరమ్మతులలో నిర్లక్ష్యం లేకుండా వేగంగా పనులు జరిగేలా చూస్తాం. త్వరలోనే పెండింగ్‌ పనులు కూడా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2022-07-21T04:58:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising