ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తుల అదృశ్య కేసులను ఛేదించాలి

ABN, First Publish Date - 2022-06-22T05:12:26+05:30

పోలీసు స్టేషన్ల వారీగా వ్యక్తుల అదృశ్య కేసులను ఛేదించాలని ఎస్పీ జీఆర్‌ రాధిక ఆదేశించారు.

మాట్లాడుతున్న ఎస్పీ రాధిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 రైల్వే, బస్సు స్టేషన్ల వద్ద గస్తీ ఉండాల్సిందే 


  ఎస్పీ జీఆర్‌ రాధిక

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూన్‌ 21: పోలీసు స్టేషన్ల వారీగా వ్యక్తుల అదృశ్య కేసులను ఛేదించాలని ఎస్పీ జీఆర్‌ రాధిక ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళ వారం పెండింగ్‌ కేసుల దర్యాప్తుపై సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి మిస్సింగ్‌ కేసులో నిశితంగా ఆధారా లను సేకరించి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. సానుభూతితో విధులు నిర్వర్తించి తప్పిపోయిన వారిని పట్టు కుని ఆయా కుటుంబాలకు అప్పగించాలన్నారు. దీనికోసం స్టేషన్ల వారీగా బృందా లను నియమించి శోధన జరగాలని తెలిపారు. ప్రతిరోజూ బస్సు, రైల్వేస్టేషన్లలో గస్తీ ముమ్మరం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఒంటరిగా ఉన్న బాలబాలికలను గుర్తిం చి వారి వివరాలను సేకరించాలని సూచించారు. అనుమానం ఉంటే గుర్తింపు కార్డుల ఆధారంగా ఆయా కుటుంబ సభ్యులకు, స్థానిక పోలీసులకు తక్షణమే సమా చా రం అందించాలని చెప్పారు. తప్పిపోయిన వ్యక్తుల ఫొటోలను నోటీసు బోర్డుల్లో, కాంప్లెక్స్‌ల వద్ద అంటించాలన్నారు. ఇతర జిల్లాల పోలీసులతో మాట్లాడుతూ మిస్సింగ్‌ కేసుల వివరాలను తెలియజే స్తుండాలని తెలిపారు. పాఠశాలలు, కళా శాలల్లో దిశ యాప్‌, పోక్సో, మహిళా చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. దిశ పోలీసులు, ఏహెచ్‌టీయూ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస రావు, విఠలేశ్వరరావు, డీఎస్పీలు మహేంద్ర, శివరామిరెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు, ఏహెచ్‌ టీయూ, దిశ సిబ్బంది పాల్గొన్నారు. 




Updated Date - 2022-06-22T05:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising