ఆదిత్యుని హుండీల ఆదాయం రూ.59 లక్షలు
ABN, First Publish Date - 2022-12-31T00:09:56+05:30
సూర్యనారాయణ స్వామివారి హుండీలను శుక్రవారం లెక్కించారు. 51 రోజులకు గాను రూ.59,34,463 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్ తెలిపారు. బంగారం 29గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి 2 కేజీల 500 గ్రా ములు, కువైట్ దీనార్, సౌదీ అరేబియా రియాల్-1, యూఎస్ డాలర్-1, కెనడా కరెన్సీ-25 వచ్చాయి.
అరసవల్లి: సూర్యనారాయణ స్వామివారి హుండీలను శుక్రవారం లెక్కించారు. 51 రోజులకు గాను రూ.59,34,463 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్ తెలిపారు. బంగారం 29గ్రాముల 500 మిల్లీగ్రాములు, వెండి 2 కేజీల 500 గ్రా ములు, కువైట్ దీనార్, సౌదీ అరేబియా రియాల్-1, యూఎస్ డాలర్-1, కెనడా కరెన్సీ-25 వచ్చాయి. జిల్లా దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ బీవీఆర్ ప్రసాద్ పట్నాయక్, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు అరసవల్లికి చెందిన వడ్డి లక్ష్మణరావు, ఉమా దంపతులు ఆదిత్యుని శాశ్వత అన్నదాన పథకానికి రూ.2 లక్షలు విరాళంగా అందజేశారు.
Updated Date - 2022-12-31T00:09:58+05:30 IST