ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక 6 రోజులే

ABN, First Publish Date - 2022-07-26T04:31:42+05:30

పీఎంకిసాన్‌ పథకానికి గడువు ముంచుకొస్తోంది. ఇప్పటివరకు 50 శాతం మాత్రమే ఈకేవైసీపీ పూర్తి కాగా, ఈ నెలఖారులోగా ప్రక్రియ పూర్తవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఆధార్‌, బ్యాంకు ఖాతా అనుసంధానం, ఈకేవైసీ నమోదు వంటి సాంకేతిక సమస్యలతో చాలామంది రైతులు ఈ పథకానికి దూరమవుతున్నారు. రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంకిసాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి మూడు విడతల్లో రూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘పీఎంకిసాన్‌’కు ముంచుకొస్తున్న గడువు

ఇప్పటికి 50 శాతం మాత్రమే ఈకేవైసీ పూర్తి

సాంకేతిక సమస్యతో రైతులకు ఇబ్బందులు 

(మెళియాపుట్టి)

పీఎంకిసాన్‌ పథకానికి గడువు ముంచుకొస్తోంది. ఇప్పటివరకు 50 శాతం మాత్రమే ఈకేవైసీపీ పూర్తి కాగా, ఈ నెలఖారులోగా ప్రక్రియ పూర్తవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఆధార్‌, బ్యాంకు ఖాతా అనుసంధానం, ఈకేవైసీ నమోదు వంటి సాంకేతిక సమస్యలతో చాలామంది రైతులు ఈ పథకానికి దూరమవుతున్నారు. రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంకిసాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏడాదికి మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున మొత్తం రూ.6వేలు అందజేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 11 విడతల్లో సాయం విడుదల చేసింది. కాగా, జిల్లాలో రైతులు అధికంగా ఉన్నా.. సాంకేతిక కారణాలు చూపి అర్హులకు డబ్బులు అందజేయడం లేదు. మరోవైపు ఆదాయపు పన్ను, ప్రభుత్వ ఉద్యోగులు, మృతుల పేరిట వారి కుటుంబ సభ్యుల్లో కొందరికి సాయం అందుతోంది. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు అందడంతో ఈకేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించింది. ఈ నెల 31వ తేదీలోగా ఈకేవైసీ చేసుకోవాలని ఆదేశించింది. జిల్లాలో 3,22,778 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 1,58,319 మంది మాత్రమే ఈకేవైసీ చేసుకున్నారు. ఇంకా 1,64,459 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. మరో ఆరు రోజులే గడువు ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అవగాహన లేక కొంతమంది రైతులు ఈకేవైసీ నమోదు చేయించుకోలేకపోతున్నారు. మరికొందరు ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నెంబర్‌ను అనుసంధానం చేయక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇప్పటివరకు 50 శాతం మాత్రమే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు రెండు రోజులుగా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి.. రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిపై పలాస వ్యవసాయశాఖ జేడీ ఎల్‌.మధు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. ఈకేవైసీ నమోదు కాని రైతుల జాబితాను సచివాలయాలకు పంపించామని తెలిపారు. వలంటీర్లు కూడా సహకరించాలని సూచించారు. ఫోన్‌లు, ఇంటర్నెట్‌ కేంద్రాలు, ఆధార్‌ సెంటర్లలో కూడా ఈకేవైసీ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. 





Updated Date - 2022-07-26T04:31:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising