ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖ్యమంత్రి పర్యటన ఖరారు

ABN, First Publish Date - 2022-08-05T05:42:27+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. శనివారం ఆమదాలవలసలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనున్నారు. శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధి తిమ్మాపురం వద్దకు హెలీకాఫ్టర్‌లో సీఎం చేరుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/ ఆమదాలవలస, ఆగస్టు 04 : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. శనివారం ఆమదాలవలసలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనున్నారు. శనివారం మధ్యాహ్నం 3.20 గంటలకు ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధి తిమ్మాపురం వద్దకు హెలీకాఫ్టర్‌లో సీఎం చేరుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో 3.40 గంటల వరకు ఇంటరాక్ట్‌ అవుతారు. ఆ తర్వాత 3.50 గంటలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 4.25 గంటల వరకు అక్కడే ఉంటారు. అనంతరం 4.30 గంటలకు విశాఖపట్నానికి హెలీకాఫ్టర్‌లో బయలుదేరి వెళ్తారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి గురువారం రాత్రి ప్రకటన జారీ అయ్యింది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎస్పీ జీఆర్‌ రాధిక గురువారం ఆమదాలవలసలో పర్యటించారు. హెలీప్యాడ్‌ను పరిశీలించారు.  ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... సీఎంను కలిసేవారి జాబితాను ఇవ్వాలని, ఆ మేరకే వారికి అనుమతి ఇస్తామని నిర్వాహకులకు స్పష్టం చేశారు. తక్కువ మంది ఉండేలా చూడాలన్నారు. ముఖ్యమంత్రి ఇతర వీఐపీలకు వేర్వేరుగా డైనింగ్‌ హాల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.  ముఖ్యమంత్రి భద్రతపై శుక్రవారం మాక్‌డ్రిల్‌ చేపట్టాలని సీఐ పైడయ్యను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కె.శ్రీనివాసరావు, డీఎస్పీ మహేంద్ర తదితరులు ఉన్నారు.  

 

Updated Date - 2022-08-05T05:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising