ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళలను సంరక్షించాలి

ABN, First Publish Date - 2022-01-12T05:30:00+05:30

అంతరించిపోతున్న కళలను సంరక్షించే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జానపద సాహిత్యకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న, ఏపీ స్టేట్‌ క్రియేటివిటీ కల్చరల్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ వంగపండు ఉష తెలిపారు. బుధవారం మందస మండలం మొగిలిపాడులో సిక్కోలు జానపద సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జానపద కళాజాత నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న

మొగిలిపాడులో సందడిగా సిక్కోలు జానపద కళాజాత

హరిపురం, జనవరి 12: అంతరించిపోతున్న కళలను సంరక్షించే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జానపద సాహిత్యకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరటి వెంకన్న, ఏపీ స్టేట్‌ క్రియేటివిటీ కల్చరల్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ వంగపండు ఉష తెలిపారు. బుధవారం మందస మండలం మొగిలిపాడులో సిక్కోలు జానపద సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జానపద కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానపదాలకు ఆదరణ తగ్గలేదన్నారు. సినీ పరిశ్రమలో జానపద గీతాలే ముందువరుసలో ఉంటున్నాయని చెప్పారు. సినీ నటుడు డాక్టర్‌ కుమార్‌నాయక్‌ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో కళాకారుల్లోని ప్రతిభ అందరికీ తెలిసేందుకు ఇటువంటి కళాజాతలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా జానపద గీతాలు, జముకల కథ, తప్పెటగుళ్లు, జాలరి నృత్యాలు, అమ్మవారి పాటలు, 42 విభాగాల్లో వివిధ రకాల కళలను ప్రదర్శించారు. గోరటి వెంకన్న, వంగపండు ఉష ఆలపించిన ‘గల్లీ చిన్నది’ వంటి గీతాలు అలరించాయి. జానపద కళాకారులు రట్టి భగవాన్‌దాస్‌, బాడ సూరన్న, అసిరయ్య, నెల్లూరు చిన్నారులు ఆలపించిన గీతాలతోపాటు పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ దానయ్య, జడ్పీటీసీ చంద్రమ్మ, మామిడి కృష్ణారావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-12T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising