ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యం కావాలి
ABN, First Publish Date - 2022-12-16T23:18:49+05:30
పది, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా పాటుపడాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా లయాల జిల్లా కోఆర్డినేటర్ జి గ్రేస్ అన్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా బోధనా తీరును పరిశీలించి విద్యార్థినుల విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు.
పాతపట్నం: పది, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా పాటుపడాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా లయాల జిల్లా కోఆర్డినేటర్ జి గ్రేస్ అన్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా బోధనా తీరును పరిశీలించి విద్యార్థినుల విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. విద్యార్థినులను గ్రేడ్‌ల వారీగా విభజించి మంచి ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచిం చారు. విద్యార్థినులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా శ్రద్ధ చూపాలని ప్రిన్సిపాల్ వి.అర్చనకు సూచించారు.
Updated Date - 2022-12-16T23:18:51+05:30 IST