బాతువలో ఇరువర్గాలతో చర్చలు
ABN, First Publish Date - 2022-10-07T05:45:02+05:30
బాతువలో ఇరువర్గాలతో చర్చలు
- నిత్యావసర సరుకులు ఇవ్వకపోవడంపై రజకుల ఫిర్యాదు
- గ్రామస్థులతో మాట్లాడిన అధికారులు
జి.సిగడాం: బాతువ గ్రా మంలో రజకులకు గ్రామస్థులకు మధ్య బట్టలు ఉతికే విషయం లో గత మూడు రోజులుగా వి వాదం కొనసాగుతోంది. ఈ క్ర మంలో గ్రామస్థులు రజకులకు ఎటువంటి సహకారం అందించ మని గ్రామస్థులు తేల్చిచెప్పారు. నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం లేదని రజకులు అధికారులకు ఫిర్యాదు చేశా రు. దీంతో గురువారం అధికారులు గ్రామానికి చేరుకొని సర్పంచ్ ప్రతినిధి దబ్బాడ ఆదినారాయణతోపాటు గ్రామస్థులతో చర్చించారు. కాగా ఈ నెల 4న తహసీల్దార్, జేఆర్ పురం సీఐ, జి.సిగడాం ఎస్‌ఐ, రజక కార్పొరేషన్ డైరెక్టర్ యువశ్రీతో చర్చించి సమస్యను ఓ కొలిక్కి తెచ్చారు. ఇంతలో మళ్లీ వివాదం మొదటికొచ్చింది. దీంతో అధి కారులు గ్రామానికి చేరుకుని గ్రామ పెద్దలతో చర్చించారు. సర్పంచ్ ప్రతినిధి ఆదినా రాయణ మాట్లాడుతూ.. నిత్యవసర సరుకులు ఇవ్వడం ఇవ్వకూడదనేది వ్యాపారులకు సంబంధించిన విషయమని, ఇందలో తన ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పారు. కొంతకాలం ఓపికతో ఉంటే అన్ని సర్దుకుపోతాయని రజకులకు నచ్చజెప్పారు. అనం తరం సచివాలయానికి వ్యాపారులను పిలిపించి మాట్లాడారు. అందరిలాగే రజకులకు నిత్యావసర సరుకులు ఇవ్వాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిం చారు. దీంతో వ్యాపారులు సరుకులు ఇవ్వడానికి అంగీకరించారు. ఈ చర్చల్లో తహసీ ల్దార్ వేణుగోపాలరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎస్‌ఐ సామంతుల రామారావు, ఆర్‌ఐ, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-07T05:45:02+05:30 IST