ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసెట్‌లో ప్రతిభ

ABN, First Publish Date - 2022-08-09T04:38:02+05:30

ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ ఐసెట్‌ ప్రవేశపరీక్ష ఫలితాల్లోనూ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. జిల్లా నుంచి 1,225 మంది పరీక్ష రాశారు. సోమవారం విడుదలైన ఈ ఫలితాల్లో 1,046 మంది ఎంపికయ్యారు. శ్రీకాకుళంలో దీపామహల్‌ వెనుక ప్రాంతానికి చెందిన నంబాళ్ల భరద్వాజ్‌ 3వ ర్యాంకు సాధించారు. గుజరాతీపేట ప్రాంతానికి చెందిన కంచిమో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి /సంతబొమ్మాళి/ టెక్కలి రూరల్‌: ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ ఐసెట్‌ ప్రవేశపరీక్ష ఫలితాల్లోనూ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. జిల్లా నుంచి 1,225 మంది పరీక్ష రాశారు. సోమవారం విడుదలైన ఈ  ఫలితాల్లో 1,046 మంది ఎంపికయ్యారు. శ్రీకాకుళంలో దీపామహల్‌ వెనుక ప్రాంతానికి చెందిన నంబాళ్ల భరద్వాజ్‌ 3వ ర్యాంకు సాధించారు. గుజరాతీపేట ప్రాంతానికి చెందిన కంచిమోజు రాజేష్‌ 5వ ర్యాంకు సాధించారు. సంతబొమ్మాళికి చెందిన లక్కోజు హేమంత్‌కుమార్‌  రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. హేమంత్‌ తండ్రి వెంకటరమణ ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు కాగా, తల్లి పుష్పలత గృహిణి. హేమంత్‌ కుమార్‌ విశాఖలోని ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. ఎంసీఏ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్‌లో స్థిరపడతానని హేమంత్‌ తెలిపాడు. అలాగే టెక్కలికి చెందిన యర్ర బాలవెంకటభాస్కరరావు (హెచ్‌టీ నెం.4112830299)   రాష్ట్రస్థాయిలో 37వ ర్యాంకు సాధించాడు. రైల్వేస్టేషన్‌ సమీపంలో నివాసముంటున్న యర్ర శ్రీనివాసరావు, శైలజ దంపతుల కుమారుడు భాస్కరరావు స్థానిక మధర్‌ధెరీసా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తిచేశాడు. ఐసెట్‌ ఫలితాల్లో ప్రతిభ చూపడంతో పలువురు అభినందించారు. 


Updated Date - 2022-08-09T04:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising