ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ABN, First Publish Date - 2022-06-23T05:51:15+05:30

వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

పొందూరు: మాట్లాడుతున్న రవికుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు రవికుమార్‌ 
పొందూరు: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, నాయకుల దౌర్జన్యాలు, అవినీ తిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని  టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియో జకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం  పొందూ రులో టీడీపీ బూత్‌కమిటీ కన్వీనర్లు, పార్టీ సోషల్‌మీడియా సభ్యులతో సభ్యత్వ నమోదుపై సమీక్షించారు. మండలంలో బూత్‌లవారీగా కనీసం 16 వేలు సభ్యత్వాలను పూర్తి చేయాలని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా   నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమపథకాలను వివరించాలని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ  మం డలాధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, ప్రధాన కార్యదర్శి వి.మురళి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఎ.రాము,పార్లమెంట్‌ నియోజకవర్గ సమస్వయ కర్త సీపాన శ్రీరంగ, తెలుగు యువత జిల్లా ప్రధానకార్యదర్శి బలగ శంకరభాస్కర్‌, పట్టణ అధ్యక్షుడు అనకాపల్లి రంగ, సీహెచ్‌ కృష్ణ వాసుదేవరావు, బాడాన గిరి, పొన్నాడ రామారావు, సువ్వారి మధు, గోవిందరావు, డి.గణ పతి, బి.సత్యం, జె.శ్రీనివాసరావు  పాల్గొన్నారు.

  • సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి
  • బూర్జ: టీడీపీ సభ్యత్వ నమోదును వేగ వంతంగా పూర్తిచేయాలని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు రవి కుమార్‌ కోరారు. బుధవారం  మండలంలోని కొల్లివలసలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్య క్రమంలో జడ్పీటీసీ అన్నెపు రామకృష్ణ, టీడీపీ మండలా ధ్యక్షుడు రాంజీ, శ్రీరాములు, రాంబాబు, కన్నంనాయుడు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-23T05:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising